Home  »  TV News  »  Karthika Deepam2: గతం మర్చిపోయిన సుమిత్ర.. దీప త్యాగం చేయనుందా!

Updated : Feb 10, 2026


స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం-2 (Karthika Deepam2)'.  ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్- 589 లో.. దీప, కార్తీక్ ఇద్దరు స్కూటీ మీద శివన్నారాయణ ఇంటికి వస్తారు. అప్పుడే సుమిత్ర బయటకు నడుచుకుంటూ వస్తుంటుంది. ఆమెను చూసి ఎక్కడికి వెళ్తున్నారు అమ్మ అని అడుగుతుంది దీప. ఎవరు నువ్వు అమ్మ అని పిలుస్తున్నావని సుమిత్ర అనగానే దీప, కార్తీక్ షాక్ అవుతారు. అదేంటి అత్త.. తను దీప, నా భార్య అని  కార్తీక్ అనగానే నువ్వు ఎవరు నన్ను అత్త అని పిలుస్తున్నావని అనగానే ఇద్దరు షాక్ అవుతారు.

ఇక అప్పుడే దశరథ్ వస్తాడు. అదేంటి మామ.. ఎవరిని గుర్తుపెట్టడం లేదని కార్తీక్ అడుగుతాడు. నేను తర్వాత చెప్తానని సుమిత్రని తీసుకొని దశరథ్ లోపలికి వెళ్తాడు. ఇక దీప, కార్తీక్ లోపలికి వెళ్తారు. ఇదేం కర్మరా దేవుడా అని శివన్నారాయణ , పారిజాతం అనుకుంటారు. ఏమైందని దశరథ్ ని కార్తీక్ అడుగుతాడు. డాక్టర్‌ కి కాల్ చేశాను.. తనకు ఉన్న జబ్బులో ఇది ఒక సైడ్ ఎఫెక్ట్ అంట అని దశరథ్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు. మరి ఏం చేద్దామని కార్తీక్ అనగానే ఇంత ఐశ్వర్యం ఉండి నేను ఏం చేయలేకపోతున్నానని చెప్పుకుంటూ దశరథ్ ఏడుస్తుంటాడు. మీరు ఏడ్వకండి మామ.. నాకు ఏడుపు వస్తుంది అని కార్తీక్ అనగానే ఏం చేయాలిరా అని దశరథ్ ఎమోషనల్ అవుతాడు. అత్తకి ఏం కాదు మామయ్య అని కార్తీక్ అనగానే నాకు మాటివ్వురా అని దశరథ్ అనగానే ఇక్కడ కాదు బయట మాట్లాడుకుందామని దశరథ్ ని తీసుకొని కార్తీక్ బయటకు వస్తాడు. 

కాసేపటికి దశరథ్ ని కన్విన్స్ చేసి కార్తీక్ లోపలికి వస్తాడు. అప్పటికే దీప కనపడదు. ఇల్లంతా వెతుకుతాడు కార్తీక్ కానీ దీప ఎక్కడా కనపడకపోయేసరికి టెన్షన్ పడతాడు. ఇక డాక్టర్ దగ్గరికి దీప వెళ్ళి.. తన తల్లి సుమిత్రని కాపాడమని రిక్వెస్ట్  చేస్తుంది. మరి నీ కడుపులోని బిడ్డ ఎలా అని డాక్టర్ అంటుంది. నాకు నా తల్లి ప్రాణాలు కావాలని దీప అనగానే మీ భర్త వచ్చి నా కూతురు ఎక్కడ.. ఏం రైట్స్ ఉన్నాయని అలా ఎందుకు చేశారని నన్ను మీ భర్త అంటే నేనేం చేయాలని డాక్టర్ అనగానే దీప ఏడుస్తుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.